Thursday, July 25, 2013

పేరెంట్స్ ప్రశంసలు!

వత్తిడిలేని శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యావిధానం విద్యార్ధుల్లో భయాన్నిపోగొట్టి చదువుమీద ఆసక్తిపెంచుతోందని పేరెంట్స్ అంటున్నారు. స్కూల్ ప్రతిభాపురస్కార్ 2003 సందర్భంగా సమావేశంలో పలువురు తల్లిదండ్రులు మాట్లాడారు.అకడమిక్ ప్రోగ్రామ్ కి అదనంగా ఈ స్కూల్ అమలు చేస్తున్న డైలీ లెసన్ ప్లాన్, లాంగ్వేజి స్కిల్స్, కమ్యూనికేషన్ సి్కల్స్ వంటి టె్రయినింగులు విద్యార్ధులకు జీవితకాలపు బహుమానాలేనని ప్రస్తుతించారు...ప్రశంసించారు


గౌతమి స్మార్ట్ స్కూల్ కి పేరెంట్స్ ప్రశంసలు http://t.co/4kb6enDpzt

Wednesday, July 24, 2013

సాధింపజేసే "ఎయిమ్"

లక్ష్యం/గమ్యం నిర్ణయించుకుని నిమగ్నమై కృషిచేస్తేనే అనుకున్నది సాధించగలమని AIM -Aspire Involve  Make it happen కాన్సెప్ట్ ను ఒక ప్రోగ్రాంగా శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్ధులకు ఇంటర్నేషనల్ టె్రయినర్ గంపా నాగేశ్వరరావు చూపించారు.

అమెరికాలోని జెసిఎ యూనివర్సిటీ హెడ్ కోచ్, సుప్రసిద్ద సైకాలజిస్ట్ గంపానాగేశ్వరరావు మానవవనరుల శిక్షణా వ్యవహారాల నిపుణుడు. దేశదేశాల్లోని పలు సంస్ధల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈవిషయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అవార్డు కూడా అందుకున్నారు.

శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ ప్రతిభా పురస్కారాలు -2013 కార్యక్రమం తరువాత గంపానాగేశ్వరరావు పవర్ పాయింట్ ద్వారా విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఒక ఓరియెంటేషన్, టె్రయినింగ్ నిర్వహించారు.

సొంత లక్ష్యం (Goal) లేనివాళ్ళు ఇతరుల లక్ష్యాలు సాధించడానికి మాత్రమే పనిచేయవలసి వుంటుందని వివరించారు. ఈ విషయం అవగతం కావడానికి విద్యార్ధులతో ఆయన అనేక యాకి్టవిటీలు చేయించారు. ఆప్రేరణవల్ల విద్యార్ధులు తమతమ లక్ష్యాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వివరించగలిగారు.

ఈ తరహా కార్యక్రమాలు ఇప్పటికే అనేకం నిర్వహించడం స్కూలుకు కొత్తకాదని, విద్యార్ధులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను ఎంతటి వ్యయప్రయాసలకైనా రాజీపడకుండా నిర్వహించగలమని కరస్పాండెంట్ సుంకర రవికుమార్ ప్రకటించారు.


 


ప్రతిభా పురస్కారాలు

వేర్వేరు పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పూర్వ విద్యార్ధులకు "ప్రతిభా పురస్కార్ 2013" అవార్డులను స్కూల్ అందజేసింది.


విద్యార్ధులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హెచ్చుమార్కులతో ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు అవార్డులు సత్కారాలను జెసిఎ ఇంటర్నేషనల్ టె్రయినర్, అమెరికాలోని జెసిఎ యూనివర్సిటీ హెడ్ కోచ్, సుప్రసిద్ధ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు అందచేశారు.

2013 ఎస్ ఎస్ సి లో 9.8 గ్రేడింగ్ సాధించిన 28 మంది, CEEP-2013 లో రాష్ట్రస్ధాయి 82 వర్యాంకు సాధించిన విద్యార్ది, ఎంసెట్ లో 1000 లోపు ర్యాంకులు సాధించిన 8 మంది, ఐఐటిలో మంచి ర్యాంకులు సాధించిన 6గురు విద్యార్ధులు ఈ పురస్కారాలను అందుకున్నారు.

శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పూర్వ విద్యార్ధి అయిన ప్రముఖ హోమియో ప్రాక్టిషనర్ కొప్పిశెట్టి రామకృష్ణ విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ప్రతిభను ప్రోత్సహించి అందరు విద్యార్ధులకు స్పూర్తివంతంగా వుండాలనే ప్రతిభా పురస్కారాలను తలపెట్టామని కరస్పాండెంట్ సుంకర రవికుమార్ వివరించారు.