వేర్వేరు పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించిన శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పూర్వ విద్యార్ధులకు "ప్రతిభా పురస్కార్ 2013" అవార్డులను స్కూల్ అందజేసింది.
విద్యార్ధులు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో హెచ్చుమార్కులతో ప్రతిభ కనబరచిన విద్యార్ధులకు అవార్డులు సత్కారాలను జెసిఎ ఇంటర్నేషనల్ టె్రయినర్, అమెరికాలోని జెసిఎ యూనివర్సిటీ హెడ్ కోచ్, సుప్రసిద్ధ సైకాలజిస్ట్ గంపా నాగేశ్వరరావు అందచేశారు.
2013 ఎస్ ఎస్ సి లో 9.8 గ్రేడింగ్ సాధించిన 28 మంది, CEEP-2013 లో రాష్ట్రస్ధాయి 82 వర్యాంకు సాధించిన విద్యార్ది, ఎంసెట్ లో 1000 లోపు ర్యాంకులు సాధించిన 8 మంది, ఐఐటిలో మంచి ర్యాంకులు సాధించిన 6గురు విద్యార్ధులు ఈ పురస్కారాలను అందుకున్నారు.
శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పూర్వ విద్యార్ధి అయిన ప్రముఖ హోమియో ప్రాక్టిషనర్ కొప్పిశెట్టి రామకృష్ణ విశిష్ట అతిధిగా పాల్గొన్నారు. ప్రతిభను ప్రోత్సహించి అందరు విద్యార్ధులకు స్పూర్తివంతంగా వుండాలనే ప్రతిభా పురస్కారాలను తలపెట్టామని కరస్పాండెంట్ సుంకర రవికుమార్ వివరించారు.
No comments:
Post a Comment