Wednesday, July 24, 2013

సాధింపజేసే "ఎయిమ్"

లక్ష్యం/గమ్యం నిర్ణయించుకుని నిమగ్నమై కృషిచేస్తేనే అనుకున్నది సాధించగలమని AIM -Aspire Involve  Make it happen కాన్సెప్ట్ ను ఒక ప్రోగ్రాంగా శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ విద్యార్ధులకు ఇంటర్నేషనల్ టె్రయినర్ గంపా నాగేశ్వరరావు చూపించారు.

అమెరికాలోని జెసిఎ యూనివర్సిటీ హెడ్ కోచ్, సుప్రసిద్ద సైకాలజిస్ట్ గంపానాగేశ్వరరావు మానవవనరుల శిక్షణా వ్యవహారాల నిపుణుడు. దేశదేశాల్లోని పలు సంస్ధల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈవిషయంగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి అవార్డు కూడా అందుకున్నారు.

శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ ప్రతిభా పురస్కారాలు -2013 కార్యక్రమం తరువాత గంపానాగేశ్వరరావు పవర్ పాయింట్ ద్వారా విద్యార్ధులకోసం ప్రత్యేకంగా ఒక ఓరియెంటేషన్, టె్రయినింగ్ నిర్వహించారు.

సొంత లక్ష్యం (Goal) లేనివాళ్ళు ఇతరుల లక్ష్యాలు సాధించడానికి మాత్రమే పనిచేయవలసి వుంటుందని వివరించారు. ఈ విషయం అవగతం కావడానికి విద్యార్ధులతో ఆయన అనేక యాకి్టవిటీలు చేయించారు. ఆప్రేరణవల్ల విద్యార్ధులు తమతమ లక్ష్యాలను నిస్సంకోచంగా, నిర్భయంగా వివరించగలిగారు.

ఈ తరహా కార్యక్రమాలు ఇప్పటికే అనేకం నిర్వహించడం స్కూలుకు కొత్తకాదని, విద్యార్ధులకు ఉపయోగపడే ఇలాంటి కార్యక్రమాలను ఎంతటి వ్యయప్రయాసలకైనా రాజీపడకుండా నిర్వహించగలమని కరస్పాండెంట్ సుంకర రవికుమార్ ప్రకటించారు.


 


No comments:

Post a Comment