Tuesday, February 19, 2013

మేధస్సు ని షికారు తిప్పే వాహనాలే - కథలు!

హాయ్ బుడ్డీ!

గుళేబకావళి కోసం అడ్డదారిన అడవిలో పడిన రాకుమారుడు తెలుసా? పూటకూళ్ళమ్మ ఇంట్లో పరదేశులు గుసగుసలుగా మాట్లాడుకున్న ప్రపంచవార్తలు విన్న కథానాయకుడు తెలుసా? వజ్రాలలోయలో పడిపోయి తేరుకుని గమనించి ఆలోచించి గంఢబేరుంఢ పక్షి రెక్కలకు అంటుకునేలా ఒదిగి ఆరాకాసి పక్షితోనే బయటపడిన వివేక వీరుడుతెలుసా

ఇపుడు ఈ కథలు లేవు అవిచెప్పే నానమ్మలో అమ్మమ్మలో లేరు. కాన్వెంటు చదువులతో పాటే రాత్రి నిద్రపోయేముందు వినే 'బెడ్ టైం' స్టోరీలు వచ్చాయి. వాటికి మన 'పేదరాశి పెద్దమ్మ' కధలకు తేడాలేదు. మనకథల్లో మన జాగ్రఫీ వుంటే ఆస్టోరీల్లో యూరోపియన్ సంసృ్కతీ నేపధ్యాలు వుంటాయి. బ్యాక్ డ్రాప్ మారినా కథలు ఆగక సాగుతూనే వున్నాయి.

ఏదో రూపంలో కథలు చదువుకునే పిల్లలకు చాలా ముఖ్యం. కంటితో చూసి(చదివి), చెవితో విని, ముక్కుతో వాసనచూసి, నోటితో మాట్లాడి చాలాతెలుసుకుంటాము. నేర్చుకునే ప్రాసెస్ లో కుతూహలం అతిముఖ్యమైంది. కుతూహలం మాత్రమే అన్న అనుమానాలనూ తీర్చలేదు. మేధస్సు మేల్కొంటేగాని సమాధానాలురావు. ఈ ప్రక్రియలో మేధను సూటిగా ఆకర్షించి ఆలోచంపచేయడానికే కథలు పుట్టాయి. అందులో ఉత్కంఠ,సాహసం,శౌర్యం,త్యాగం లాంటి హీరో క్వాలిటీలన్నీ వుంటాయి. మనిషిగా ఎదిగుతున్న చిన్నదశలోనే మంచిలక్షణాలను మనస్సుల్లో నింపడానికే బెడ్ టైమ్ స్టోరీలైనా, కాశీమజిలీ కథలైనా...

ఒక్క మాటలో చెప్పాలంటే...మనం తిరిగిరావడానికి కాళ్ళున్నాయి...టూ వీలర్లున్నాయి...కార్లున్నాయి...టె్రయిన్లున్నాయి...ఫై్లటు్ల
న్నాయి. మనమేధస్సు షికారు చేయించే వెహికల్సే కథలు

ఊహల నుంచి కథలు పుట్టాయి...కథల నుంచి కలలు పుడతాయి...కలలు నెరవేర్చే సాధకులూ పుడతారు...వారిసాధనలే ప్రపంచానికి పరికరాలౌతాయి...
నేను హైస్కూల్లో వున్నపుడు పిల్లల కథల మాసపత్రిక ' చందమామ' అదేపనిగా చదివేవాడిని. మాయాబజార్ సినిమా చూసి అందులో మాయా పేటికలో చందమామ పుస్తకం కనబడాలను కునేవాడిని. పలకమీద చందమామ ప్రత్యక్షమై మీట నొక్కితే మాయమైపోవాలని కోరుకునేవాడిని. బాగా పెద్దయ్యాక కూడా అది నాకు ఇష్టమైన కలగానే వుండిపోయింది. అనుకోకుండా మూడేళ్ళక్రితం నా కలనెరవేరింది. స్టివ్ జాబ్స్ కి కూడా అలాంటి కలే వచ్చిందేమో! ఆయన 'ఐపాడ్' సృష్టించాడు. ఐపాడ్ మీద ఇపుడు చందమామ చదువుతున్నాను

మరచిపోవద్దు! పూనుకుంటే ప్రతీ కథా, కలా నెరవేరుతుంది!!

-ఫేస్ బుక్ మామయ్య





No comments:

Post a Comment