Friday, March 01, 2013

మన గౌరవం!మన గర్వకారణం!!-సైనా!!!




ఇండోనేషియా ఓపెన్ టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించారు. నెహ్వాల్కు ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల చెక్ను ముఖ్యమంత్రి అందజేశారు.

స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్కు స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ మహిళల సింగిల్స్లో టాప్ సీడ్ లభించింది. మార్చి 12 నుంచి 17 వరకు ఇక్కడ జరిగే ఈ టోర్నీకి ప్రపంచ నెం.1 చైనా క్రీడాకారిణి లీ జురేయీ ఆడకూడదని నిర్ణయించుకోవడంతో సైనా టాప్ సీడ్గా బరిలోకి దిగనుంది.

2011, 12 సంవత్సరాల్లో స్విస్ ఓపెన్ చాంపియన్ అయిన సైనా.. తొలి రౌండ్లో ఫ్రెంచ్ క్రీడాకారిణి సాషిన విగ్నెస్ వారన్తో తలపడనుంది. పీవీ సింధు కూడా ఇదే విభాగం తొలి రౌండ్లో కొరియా షట్లర్ సంగ్ జీ హ్యున్ తో పోటీ పడనుంది. అంతకు ముందు మార్చి 5 నుంచి 10 వరకు బర్మింగ్హమ్లో జరిగే ఆల్ ఇంగ్లండ్ చాంపియన్షిప్లో సైనా రెండో సీడ్గా బరిలోకి దిగనుంది. మరో షట్లర్ పారుపల్లి కశ్యప్కు స్విస్ ఓపెన్ పురుషుల సింగిల్స్లో ఐదో సీడ్ లభించింది. తొలి రౌండ్లో చైనీస్ తైపీ సుయే సువన్ యీతో కశ్యప్ తలపడనున్నాడు.

No comments:

Post a Comment