ప్రతిభను ఉత్సాహంగా బయట పెట్టడానికి, నైపుణ్యానికి మెరుగులు దిద్దుకోడానికీ శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ వారంరోజుల FROLIC - FEST 2013 విద్యార్ధులకు విశేషంగా ఉపయోగపడింది.
జెకె గార్డెన్స్ లో గాంధీనగర్, శ్రీరామ్ నగర్ క్యాంపస్ ల విద్యార్ధులు ప్రదర్శించిన కార్యక్రమాల చివరిరోజు కార్యక్రమాలను యూరాలజిస్ట్ డాక్టర్ టివి నారాయణరావు ప్రారంభించారు. ఎకెసి జూనియర్ కాలేజి ప్రిన్సిపాల్ జె పాండురంగారావు విశిష్ట అతిథిగా సందేశమిచ్చారు.
కరస్పాండెంట్ సుంకర రవికుమార్, చైర్మన్ సూర్యప్రకాశరావు, ప్రిన్సిపాల్, అకడమిక్ ఇన్ చార్జ్ లు పాల్గొన్నారు.
చదువులో మాత్రమే కాక చొరవ నైపుణ్యాలను ప్రదర్శించే సాంస్కృతిక కార్యక్రమాల వైపు విశేషంగా పిల్లల్ని ప్రోత్సహించడంలో కూడా శ్రీగౌతమి స్మార్ట్ స్కూల్ పేరెంట్స్ తరువాతే ఎవరైనా అనికూడా ఈ వారంరోజుల కార్యక్రమాలు మరోసారి నిరూపించాయి
No comments:
Post a Comment