Monday, March 18, 2013

పేరెంట్స్ కే ఇది పరీక్షా కాలం

*ప్రోత్సాహం
పరీక్ష నీ భవితకోసమే కాని, మా కోసం కాదు. ఇంతవరకు ఎలా మంచిఫలితాలు సాధించావో అలాగే ఈ పరీక్షలు రాయమని పిల్లల్ని ప్రోత్సహించాలి.

*చాలినంత నిద్ర
పరీక్షలకు కొన్నిరోజుల ముందే పునశ్చరణ తగినంత ముందుగా చేయకుండా పరీక్షల ముందే మొదలెడితే పిల్లలు పరీక్ష రోజున అలసిపోతారు. చాలినంత నిద్ర వుండేలా చూడండి.

*పోషకాహారం
రోజూ పిల్లలకు పోషకవిలువలు గల ఆహారాన్ని ఇవ్వాలి. పరీక్షల సమయంలో మరింత శ్రద్ధగా, జాగ్రత్తగా, మరింత శక్తిని, బలాన్ని, ఉత్సాహాన్నిచ్చే ఆహారం ఇవ్వాలి. సరిగా తినకపోతే పిల్లలు నెర్వల్నెస్కి, అనవసర ఆందోళనలు, భయాలకు లోనవుతారు. రకరకాల పండ్ల రసాలు ఇవ్వడం వలన వాళ్ళకు తక్షణ శక్తి లభిస్తుంది. చదువు పేరుతో వారు భోజనం మానకుండా చూడడం అత్యవసరం.

*పాతమార్కుల మాట వద్దు
గతం మార్కుల గురించి ప్రస్తావన వద్దు
అయిపోయిన పరీక్షల గురించి మరిచిపోయేలా పిల్లల్ని ప్రోత్సహించండి. లేకపోతే నిన్న పరీక్ష ఎలా రాశాను అన్నఆలోచనలో ఉంటారు. మార్నాటి పరీక్షపై పరీక్షపై సరిగా దృష్టి కేంద్రీకరించలేకపోవచ్చు.


No comments:

Post a Comment